Endowment EO (Grade-3) Notification details in Telugu
Here we are trying to discuss about Endowment EO (Grade-3) Notification details in Telugu. The APPSC to fill a total of 60 vacancies in respect of grade-3 EO section of the Endowment Department. The notification was released on 28.12.2021. Let us try to find out the important features of this notification in Telugu. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లోని గ్రేడ్-3 ఈవో విభాగానికి సంబంధించి మొత్తం 60 ఖాళీలను భర్తీ చేయడానికి APPSC ది. 28.12.2021 న నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో ముఖ్యమైన విశేషాలను తెలుగులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Pay scales of Endowment Executive Officers:
ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లోని 60 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకై appsc నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ విభాగానికి సంబంధించిన ఈవో పోస్టులకు సంబంధించిన పేస్కేల్ 16,400 నుంచి 49,870 గా నిర్ణయించడం జరిగింది.
Age Limit for EO, Endowment Department:
ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ పోస్టులకై అప్లై చేయగోరు అభ్యర్ధులు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సును కలిగి ఉండవలెను. 01.07.2021 నాటికి వయస్సు 18 సంవత్సరాలు నిండని అభ్యర్ధులు, వయస్సు 42 సంవత్సరాలు మించిన అభ్యర్ధులు ఈ పోస్టుకై అప్లై చేయడానికి అర్హులు కారు. వివిధ కేటగిరీలను అనుసరించి వయస్సు సడలింపు ప్రక్రియ ఇతర నోటిఫికేషన్ల మాదిరిగానే ఉన్నట్లు క్రింది పట్టికను అనుసరించి తెలుస్తుంది.

Eligible Religion for Executive Officers (Endowment Department)
appsc విడుదల చేసిన నోటిఫికేషన్ ను అనుసరించి భర్తీ అయిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గా పనిచేయాల్సి ఉంటుంది. ఈ పోస్టుకు హిందూ మతాన్ని అనుసరిస్తున్న వారు మాత్రమే అర్హులు అని నోటిఫికేషన్ లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది.
ఇవి కూడా చూడండి . . .
Application Fee for Executive Officers Post:
ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గ్రేడ్-3 పోస్టులకై అప్లై చేయగోరు అభ్యర్ధులు అప్లికేషన్ రుసుము క్రింద రూ. 250, ఎగ్జామ్ ఫీజు క్రింద రూ. 80 చెల్లించాల్సి ఉంటుంది. SC, ST, BC, PH & Ex–service Men, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నవారు, మరియు ప్రత్యేక కేటగిరీలకు చెందిన అభ్యర్ధులు ఎగ్జామినేషన్ ఫీజు నుంచి మినహాయింపు పొందడం జరిగింది. కనుక వీరు ఎగ్జామినేషన్ రుసుము రూ. 80 చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ అప్లికేషన్ రుసుము రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రేతర అభ్యర్ధులు అప్లై చేసుకోవాలనుకుంటున్నట్లయితే పేరా-8 లోని సూచనలను అనుసరించి ప్రత్యేక మాధ్యమం ద్వారా అప్లికేషన్ రుసుము రూ. 250, ఎగ్జామినేషన్ ఫీజు రూ. 80 పే చేయాల్సి ఉంటుంది.
Application process of Executive Officer Grade–3:
appsc విడుదల చేసిన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్ధులు 30/12/2021 నుంచి 19/01/2022 మధ్య appsc official website https://psc.ap.gov.in ద్వారా తమ దరఖాస్తులను ఆన్ లైన్ లో సమర్పించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజును చెల్లించడానికి ఆఖరు తేదీ 18/01/2022.
Application Process Starts from: 30/12/2021
Application Process Last Date: 19/01/2022
ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ పోస్టులకై అప్లై చేయడానికి అభ్యర్ధులు క్రింది సూచనలను అనుసరించాల్సి ఉంటుంది.
స్టెప్-1: appsc website https://psc.ap.gov.in లో OTPR ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
స్టెప్-2: OTPR ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ సైట్ లోకి లాగినై, Online Application Submission లింక్ పై క్లిక్ చేయాలి.
స్టెప్-3: ఓపెన్ అయిన అప్లికేషన్ లో అడగబడిన అన్ని వివరాలను సక్రమంగా పూర్తి చేయాలి. వివరాలను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తరువాత Submit పై క్లిక్ చేసి పేమెంట్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
స్టెప్-4: పేమెంట్ ప్రక్రియ, application submission ప్రక్రియ పూర్తి చేసిన తరువాత రిఫరెన్స్ ఐడి జనరేట్ చేసి ఇవ్వబడుతుంది. ఈ రిఫరెన్స్ ఐడి ను భవిష్యత్ అవసరాల నిమిత్తం అభ్యర్ధులు భద్రపరచుకోవాల్సి ఉంటుంది.
స్టెప్-5: ఒకవేళ ఆన్ లైన్ పేమెంట్ ప్రక్రియలో ఏదైనా లోపం ఎదురైనట్లయితే అభ్యర్ధులు మరలా స్టెప్-2 నుంచి తిరిగి చేయాల్సి ఉంటుంది.
స్టెప్-6: అప్లికేషన్ ప్రక్రియ పూర్తైన తరువాత, Correction in application form ఎనేబుల్ అవుతుంది. ఈ ఫామ్ ద్వారా అభ్యర్ధులు ఒకవేళ తాము ఏదైనా పొరపాటు చేసి ఉన్నట్లయితే వాటిని సవరించుకోవచ్చు.
Cetificates Required/Available for Executive Officers:
అభ్యర్ధులు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ పోస్టులకై అప్లై చేయు సందర్భంలో అవసరం అయిన వివిధ సర్టిఫికెట్లకు సంబంధించిన నమూనా ప్రతులను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తమ వెబ్ సైట్ లో పొందుపరచడం జరిగింది.
Community, Nativity and Date of Birth Certificate (కుల, ప్రాంత ధృవీకరణ పత్రాలు)
Declaration by the Un–Employed (నిరుద్యోగి ధృవీకరణ పత్రము)
School Study Certificate (స్టడీ సర్టిఫికెట్స్)
Certificate of Residence (నేటివిటీ సర్టిఫికెట్స్)
Medical Certificate for the Blind
Certificate of Hearing Disability and Hearing Assessment
Medical Certificate in respect of Orthopedically Handicapped Candidates
Creamy Layer Certificate
Local status certificate
Scheme of Examination Executive Officers (Endowment Department):
ఎండోమెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ మొత్తంగా రెండు దశలలో జరుగుతుంది. జివో – 39 ను అనుసరించి అప్లై చేసిన అభ్యర్ధుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లయితే మొదట స్క్రీనింగ్ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. ఈ స్క్రీనింగ్ పరీక్షలో ఎంపికైన అభ్యర్ధులకు మెయిన్స్ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది.
Scheme of Screening test:
ఎండోమెంట్ ఆఫీసర్స్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్ధుల సంఖ్యను బట్టి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందా లేదా అన్నది నిర్ణయించబడుతుంది. అప్లై చేసిన అభ్యర్ధుల సంఖ్య ఉన్న పోస్టుల సంఖ్య కంటే 200 రెట్లు అదనం అయితే (అంటే సుమారుగా 12000) స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా అప్లై చేసే అభ్యర్ధుల సంఖ్య 12,000 కంటే ఎక్కువే ఉంటుంది కనుక స్క్రీనింగ్ టెస్ట్ తప్పనిసరి అని భావించవచ్చు. పూర్తి ఆఫ్ లైన్ వ్రాత పరీక్షగా నిర్వహించబడే స్క్రీనింగ్ పరీక్ష 150 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించబడుతుంది. ప్రశ్నల కఠినతా స్థాయి డిగ్రీ స్థాయిగా నిర్ణయించబడినది. రెండు సెక్షన్లలో మొత్తం 150 బిట్స్ స్క్రీనింగ్ టెస్ట్ లో అడగడం జరుగుతుంది.
సెక్షన్-A: జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ – 50 మార్కులకు 50 ప్రశ్నలు
సెక్షన్-B: హిందూ తత్వశాస్త్రం & దేవాలయ వ్యవస్థ – 100 మార్కులకు 100 ప్రశ్నలు.
ఇవ్వబడిన సిలబస్ ను తెలుగు మాధ్యమంలో ప్రిపేర్ అయ్యే అభ్యర్ధులకోసం నవచైతన్య కాంపిటీషన్స్ తెలుగులోకి అనువదించి అందిస్తోంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్-3 సిలబస్ తెలుగులో పొందడం కోసం ENDOWMENT EO అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపండి.
Scheme for Main Examination:
ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఈవో గ్రేడ్-3 మెయిన్స్ ఎగ్జామ్ కూడా కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్షగా నిర్వహించబడుతుంది. మొత్తం 300 మార్కులకు రెండు పేపర్లుగా నిర్వహించబడే ఈ పరీక్షలో ప్రశ్నలు డిగ్రీ స్థాయిలో అడగబడతాయి.
పేపర్-1: జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ – 150 మార్కులకు 150 ప్రశ్నలు
పేపర్-2: హిందూ తత్వశాస్త్రం & దేవాలయ వ్యవస్థ – 150 మార్కులకు 150 ప్రశ్నలు.
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్-3 మెయిన్స్ పరీక్షకూ, స్క్రీనింగ్ పరీక్షకూ ఒకే సిలబస్ ను నిర్ణయించడం జరిగింది. ప్రిపేర్ అయ్యే అభ్యర్ధులకు ఇది అనుకూలించే అంశం. ఒకే సిలబస్ ను క్షుణ్ణంగా చదవడం ద్వారా ఇటు మెయిన్స్ కు అటు ప్రిలిమ్స్ కూ ఏకకాలంలో సిద్ధం అయ్యే అవకాశం లభిస్తుంది. ఈ సిలబస్ ను తెలుగులో పొందడం కోసం ENDOWMENT EO అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపండి
Negative Marking:
జివో-235 అనుసరించి ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులు తగ్గించబడతాయి. అయితే నెగటివ్ మార్కింగ్ గురించి ఎండోమెంట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ నందు ఎక్కడా స్పష్టంగా పేర్కొనబడలేదు. కనుక ఈ విషయమై మరికాస్త స్పష్టత రావాల్సి ఉంది.
Medium of Question Paper – Junior cum Computer Assistant:
ఎండోమెంట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకై జరిగే పరీక్ష తెలుగు మరియు ఇంగ్లీష్ మాధ్యమాలలో నిర్వహించబడుతుంది. ఏ మీడియంలో పరీక్ష రాయాలనుకుంటున్నారో అభ్యర్ధులు అప్లికేషన్ సమయంలో నిర్ణయించుకోవచ్చు. అప్లికేషన్ సమయంలో ఎంచుకున్న మాధ్యమంలోనే పరీక్ష నిర్వహించబడుతుంది. అయితే కీ వెరిఫికేషన్, ఫైనల్ కీ నిర్ణయం కోసం మాత్రం ఆంగ్ల మాధ్యమంలో ఇవ్వబడిన ప్రశ్నాపత్రమును మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
Syllabus of Executive Officer (Grade–3)
ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్-3 పోటీ పరీక్షకు సంబంధించిన సిలబస్ యొక్క తెలుగు అనువాదం కోసం ENDOWMENT EO అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపండి.
Executive Officer Examination Centers:
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్-3 పరీక్షకు సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్ల వివరాలను త్వరలోనే appsc ప్రకటించనున్నది. అప్లికేషన్ చేసే సందర్భంలో అభ్యర్ధులు కనీసం మూడు ఎగ్జామినేషన్ సెంటర్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. వాటినుంచి అందుబాటులో గల Executive Officer Examination center ను కమిషన్ కేటాయిస్తుంది. ఈ ఎగ్జామినేషన్ సెంటర్ల వివరాలకోసం appsc అధికారిక వెబ్ సైట్ ను అభ్యర్ధులు తరచూ చూస్తూ ఉండాలి.
Mock tests for appsc Grade–3 EO Endowment Department
appsc Executive Officer Post కు సంబంధించిన రాత పరీక్ష పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ ఆన్ లైన్ పరీక్షగా appsc నిర్వహిస్తుండటంతో Endowment EO కు సంబంధించిన ఆన్ లైన్ మాక్ టెస్ట్ సౌకర్యాన్ని పోస్ట్ కు అప్లై చేసిన అభ్యర్దులకు appsc కల్పించనున్నది. కంప్యూటర్ బేస్డ్ ఆన్ లైన్ పరీక్షను రాయడంలో ప్రాక్టీస్ కోసం ఈ Executive Officers (Grade–3) mocktests ఉపకరిస్తాయని appsc వెబ్ సైట్ లో తెలియచేయడం జరిగింది. ఆన్ లైన్ మాక్ టెస్ట్ ల కోసం https://psc.ap.gov.in వెబ్ సైట్ ను దర్శించవచ్చు.
ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ (గ్రేడ్-3) పోస్టులకు సిద్ధం అవుతున్న అభ్యర్ధులకు, మొత్తం సిలబస్ ను క్షుణ్ణంగా అధ్యయనం చేయడంతో పాటు ఎప్పటికప్పుడు తమ ప్రగతిని అంచనావేసుకోవడానికి సహకరించేలా నవచైతన్య కాంపిటీషన్స్ ఎండోమెంట్ ఈవో – 70 రోజుల ప్రణాళిక – 70 ఆన్ లైన్ పరీక్షలను అందిస్తోంది. నవచైతన్య కాంపిటీషన్స్ ఎండోమెంట్ ఆఫీసర్స్ ఆన్ లైన్ టెస్ట్ సిరీస్ గురించిన పూర్తి వివరాలను వాట్సాప్ ద్వారా తెలుసుకోవడం కోసం ENDOWMENT EO అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపాల్సి ఉంటుంది.
Important Notice by APPSC:
ఎండోమెంట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయ్యే వరకూ ముఖ్యమైన సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తమ అధికారిక వెబ్ సైట్ ద్వారా అందించడం జరుగుతుంది. కనుక పోస్టులకోసం అప్లై చేసుకున్న అభ్యర్ధులు తరచూ వెబ్ సైట్ ను చూడటం ద్వారా ముఖ్యమైన సమాచారం మిస్ కాకుండా పొందే అవకాశం ఉంటుంది అని నోటిఫికేషన్ లో స్పష్టం చేయడం జరిగింది.
Executive Officers Endowment Department Hall tickets:
ఎండోమెంట్ ఈవో పోస్టులకు సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ మరియు మెయిన్స్ ఎగ్జామ్ (కంప్యూటర్ బేస్డ్) పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తమ అధికారిక వెబ్ సైట్ నందు పొందుపరచడం జరుగుతుంది. కనుక హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవడం కోసం కమిషన్ ప్రకటన అనంతరం అధికారికి appsc వెబ్ సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది.
Endowment Department Grade–3 Executive Officer Vacencies:
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 60 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లుగా appsc ప్రకటించింది. జిల్లాల వారీగా పరిశీలించినపుడు తూర్పుగోదావరి జిల్లాలో గరిష్టంగా 8 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఖాళీలు ఉండగా, కనిష్టంగా చిత్తూరు మరియు కడప జిల్లాలలో ఒక్కొక్క ఖాళీ ఉంది. జిల్లాల వారీగా క్రింది విధంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషన్ లో తెలియచేశారు.
Srikakulam – 4
Vizianagaram – 4
Visakhapatnam – 4
East Godavari – 8
West Godavari – 7
Krishna – 6
Guntur – 7
Prakasam – 6
SPS Nellore – 4
Chittoor – 1
Ananthapuram – 2
Kurnool – 6
YSR Kadapa – 1
క్రింది పట్టిక ద్వారా జిల్లాల వారీగా నాన్ లోకల్, లోక్ కేటగిరీల వారీగా, వివిధ రిజర్వేషన్ కేటగిరీల వారీగా గల పోస్టుల వివరాలను తెలుసుకోవచ్చు. క్యారీ ఫార్వార్డ్ వేకెన్సీలు, ఫ్రెష్ వేకెన్సీలు విడివిడిగా పట్టికలలో పొందుపరచినప్పటికీ ఆయా విభాగానికి చెందిన అభ్యర్ధులు రెండింటిలో ఎక్క పోస్టు ఉన్నా అప్లై చేసుకోవడానికి అర్హులు అని భావించాలి.


Eligibility for Executive Officers Grade–3:
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమితులయ్యే అభ్యర్ధులు హిందూ దేవాలయాలలో విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ మరియు హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ చట్టం 30/87 లోని 29(4) సెక్షన్ అనుసరించి ఈ పోస్టులకు కేవలం హిందూ అభ్యర్ధులు మాత్రమే అర్హులు అని తెలియచేయడం జరిగింది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే నోటిఫికేషన్ విడుదల నాటికి బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసిన అభ్యర్ధులు ఎండోమెంట్ డిపార్టమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ పోస్టులకై అప్లై చేసుకోవడానికి అర్హులు.
Name of the Post: Executive Officer Grade-III in A.P. Endowments Sub-Service
Educational Qualification: Must possess a Bachelor’s Degree from a University in India established or incorporated by or under a Central Act or a State Act or Provincial Act or any other Institution recognized by the University Grants Commission or any other equivalent qualifications.
Reservation Process for Executive Officers:
కమ్యూనిటీ మరియు డిజేబులిటీ ఆధారంగా లభించే రిజర్వేషన్లు మిగిలిన అన్ని నోటిఫికేషన్ల మాదిరిగానే వర్తిస్తాయని ఈ నోటిఫికేషన్ ద్వారా తెలియవస్తున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రేతర అభ్యర్ధులు లోకల్ రిజర్వేషన్ పరిధిలోకి రారని నోటిఫికేషన్ తెలియచేస్తున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెలుపల అభ్యర్ధులు ఒకేవేళ ఈ పరీక్షను రాయాలనుకుంటున్నట్లయితే నాన్ లోకల్ కేటగిరీలో గల పోస్టుల కోసం ప్రయత్నించవచ్చు.
Thanks for reading “Endowment EO (Grade-3) Notification details in Telugu” article by NavaCHAITANYA Competitions. Please share this to your friends also.