AP TET STUDY MATERIAL – New textbook Based Books

New Text Books in Andhra Pradesh:

          ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో 2020-21 విద్యా సంవత్సరంలో 6వ తరగతి పాఠ్యపుస్తకాలలో సిలబస్ ను నూతనంగా ప్రకటించడం జరిగింది. 2021-22 విద్యా సంవత్సరం నుంచి 7వ తరగతి పాఠ్యపుస్తకాలను కూడా మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతి పాఠ్యపుస్తకాలను మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఈ పాఠ్యపుస్తకాల మార్పు ఇలా కొనసాగుతుంది. కనుక రాబోయే విద్యా సంవత్సరాలలో పూర్తిగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ కొత్త పాఠ్యపుస్తకాలు (సిలబస్) ప్రవేశపెట్టబడతాయి.

New textbooks or Old text books for AP TET–2021?

          అయితే ఈ మధ్య కాలంలో నవచైతన్య కాంపిటీషన్స్ కు తరచూ డియస్సీ అభ్యర్ధులు పంపుతున్న సందేహాలలో ఎక్కువగా కనిపించేది, ఎపి టెట్ కోసం సిద్ధం కావడానికి కొత్త పాఠ్యపుస్తకాలు చదవాలా లేక పాత పాఠ్యపుస్తకాలు చదవాలా అని. నిజానికి అభ్యర్ధులు ఇక్కడ ఏ మాత్రం గందరగోళానికి గురికానవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఎపి టెట్-2021 సిలబస్ అధికారికంగా ప్రకటించబడినది. ఎపి టెట్ సిలబస్ – 2021 ను నిశితంగా పరిశీలించినపుడు అందులో 1 నుంచి 6వ తరగతి వరకూ కొత్త పాఠ్యపుస్తకాలను చదవాలని, 7వ తరగతి నుంచి పాత పాఠ్యపుస్తకాలను చదవాలని, డీటెయిల్డ్ సిలబస్ లో స్పష్టంగా ప్రకటించియున్నారు. కనుక అభ్యర్ధులు 6వ తరగతి వరకూ కొత్త పాఠ్యపుస్తకాలను చదువుతూ, 7వ తరగతి నుంచి పాత పాఠ్యపుస్తకాలను చదివితే సరిపోతుంది.

Any Confirmation from AP TET about New Textbooks?

          అధికారికంగా ఎపి టెట్ సిలబస్ ను ప్రకటించినప్పటికీ, అది 2021 లో కావడం, టెట్ నోటిఫికేషన్ 2021 లో రాకపోవడం, ఇప్పటికే 7వ తరగతికి కొత్త పుస్తకాలు ప్రవేశపెట్టడం, ఇంకా టెట్ ఆలస్యం అయితే 8వ తరగతికి కూడా కొత్త పాఠ్యపుస్తకాలు రానున్న నేపథ్యంలో అభ్యర్ధులలో కొత్త పుస్తకాలు చదవాలా లేక పాత పుస్తకాలు చదవాలా అన్న సందేహం ఇప్పటికీ కొనసాగుతున్నది. దీనికి స్పష్టమైన ప్రకటన ఎపి టెట్ అధికారిక వెబ్ సైట్ నుంచి కానీ లేదా రాష్ట్ర విద్యాశాఖ నుంచి కానీ రానప్పటికీ అభ్యర్ధులు గమనించాల్సిందేమంటే, ఇప్పటికే అధికారికంగా సిలబస్ ను ప్రకటించడం జరిగింది. ప్రకటించిన ఈ కొత్త ap tet syllabus ఆధారంగా చేసుకుని telugu Akademy స్టడీ మెటీరియల్ ను రూపొందిస్తున్నట్లుగా గౌరవ విద్యాశాఖామాత్యులు ప్రకటించడం జరిగింది. కనుక అభ్యర్ధులు ఆందోళన చెందక అధికారికంగా ప్రకటించిన సిలబస్ ఆధారంగా ముందుకు సాగితే సరిపోతుంది.

          మరో ముఖ్యమైన విషయం ఏమంటే, ప్రస్తుతం నోటిఫికేషన్ ఇంకా రాలేదు కనుక ప్రస్తుతం చేసే ప్రిపరేషన్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కేటగిరీకి చెందుతుంది. ఎక్కువ సమయం ఉన్నపుడు అభ్యర్ధులు సిలబస్ ను విస్తృత పరిధిలో చదువుకోవడం మంచిది. ఇది సరిపోతుంది, అది సరిపోతుంది అంటూ గిరిగీసుకోకుండా అభ్యర్ధులు వీలైనంత ఎక్కువగా చదువుకుని సిద్ధం అయితే, నోటిఫికేషన్ విడుదల అయ్యాక కేవలం ప్రకటించిన సిలబస్ ను మాత్రం రివిజన్ చేస్తూ మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది. కనుక Nex textbook based Study material ను అభ్యర్ధులు సొంతంగా ప్రిపేర్ చేసుకుంటూ, Old Textbooks కూడా రిఫర్ చేస్తూ మిస్ అయిన పాయింట్స్ ను నోట్ చేసుకోవడం మంచి పద్ధతి.

Best Study Material based on New textbooks:

          New textbooks ను ఆధారంగా చేసుకుని ఇప్పటికే పలు పబ్లికేషన్స్ బుక్స్ ను మార్కెట్ లో విడుదల చేయడం జరిగింది. వీటిలో Yes & Yes పబ్లికేషన్స్ రూపొందించిన AP TET+TRT – 2021 ALL IN ONE (Based on New textbooks) ఒకటి. అభ్యర్ధులు ఎక్కువ మంది ఈ పుస్తకం గురించి అడుగుతున్న నేపథ్యంలో నవచైతన్య కాంపిటీషన్స్ టీమ్ ఈ బుక్ ను క్షుణ్ణంగా రివ్యూ చేయడం జరిగింది.

Subjects covered in this book:

          Yes & Yes పబ్లికేషన్స్ New Textbooks ఆధారంగా విడుదల చేసిన ఈ All in One పుస్తకంలో Telugu, Telugu Methodology, English, Proficiency in English, Mathematics, General Science (Physics, Chemistry, Biology) & Social Studies సబ్జక్టులకు సంబంధించి 3 నుంచి 6వ తరగతి వరకూ కొత్త పుస్తకాలలోని అన్ని చాప్టర్లనూ కవర్ చేయడం జరిగింది.

          సుమారు 768 పేజీలతో కూడిన ఈ New textbooks Based Study Material లో అన్ని సబ్జక్టులలో ముఖ్యమైన పాయింట్లను కవర్ చేయడం జరిగింది. పాఠ్యాంశాల వారీగా ముఖ్యమైన పాయింట్స్ ను కవర్ చేయడంతో పాటు ప్రాక్టీస్ బిట్స్ ను కూడా అందించడం జరిగింది. ముఖ్యంగా గణితం విభాగంలో పాఠ్యపుస్తకంలో ఇవ్వబడిన అభ్యాసం లెక్కలన్నింటినీ దాదాపుగా ప్రాక్టీస్ బిట్స్ లో కవర్ చేస్తూ Explanation ఇవ్వడం జరిగింది. నాన్ మ్యాథ్స్ అభ్యర్ధులకు ఇది బాగా ఉపకరిస్తుంది. అలాగే ఇంగ్లీష్ సబ్జక్టు విషయానికి వస్తే Proficiency in English పేరుతో ఈ book లో ఎపి టెట్ – 2021 సిలబస్ లో కవర్ చేసిన ప్రతి టాపిక్ నూ కొత్త పాఠ్యపుస్తకాలు ఆధారంగా తెలియచేయడం జరిగింది.

          సైన్స్ మరియు సోషల్ విభాగాలలో చాప్టర్లు, అవి ఏ ఏ తరగతులలో కవర్ అయ్యాయో స్పష్టం చేస్తూ టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్ ను అందించే ప్రయత్నం చేయడం జరిగింది. అభ్యర్ధులకు కన్ఫ్యూజన్ లేకుండా ఈ పుస్తకం ఉపకరిస్తుంది. ఇలా 3rd to 6th Class New Textbooks బేస్ చేసుకుని  టాపిక్స్ ను కవర్ చేస్తూ రూపొందించిన ఈ స్టడీ మెటీరియల్ ఎపి టెట్ కు సిద్ధం అవుతున్న అభ్యర్ధులకు ఉపకరిస్తుంది.

How to Buy Yes & Yes New textbook Based Study Material Book:

          ఈ పుస్తకం ప్రముఖ ప్రచురణ సంస్థ Yes & Yes రూపొందించింది కనుక మార్కెట్ లో అన్ని పుస్తకాల షాపులలోనూ లభిస్తుంది. మీకు సమీపాన గల పట్టణంలో పుస్తకాల షాపులలో ప్రయత్నించండి. ఒకవేళ మీరు గ్రామీణ ప్రాంతానికి చెందినవారై ఈ పుస్తకం మీ ప్రాంతంలో అందుబాటులో లేదు అనుకుంటే ఆన్ లైన్ లో కూడా మీరు ఈ పుస్తకాన్ని తెప్పించుకోవచ్చు. క్రింది లింక్ పై క్లిక్ చేసి పుస్తకాన్ని మీరు కొనుగోలు చేయవచ్చు

ap tet study material

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *